చాట్ జీపీటీ యూజర్ల కోసం గ్రూప్ చాట్ జీపీటీ ఫీచర్

చాట్ జీపీటీ యూజర్ల కోసం గ్రూప్ చాట్ జీపీటీ ఫీచర్

చాట్ ​జీపీటీ యూజర్ల కోసం కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. యూజర్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా కొలీగ్స్​తో కలిసి ఒకే గ్రూప్​లో మాట్లాడుకునే విధంగా ఈ ఫీచర్ సాయపడుతుంది. ఈ గ్రూప్​ చాట్‌లకు యూజర్ల పర్సనల్​ చాట్లతో లింక్​ ఉండదు. పర్సనల్ చాట్​ మెమొరీని గ్రూప్​లోని ఇతరులతో షేర్ చేసుకోదు. ఈ ఫీచర్​ ప్రస్తుతం జపాన్​, న్యూజిలాండ్​, దక్షిణ కొరియా, తైవాన్​లలో ఫ్రీ, గో, ప్లస్​, ప్రో యూజర్లకు పైలట్ దశలో డెస్క్​టాప్‌, మొబైల్ ప్లాట్​ఫామ్లలో అందుబాటులో ఉంది.

గ్రూప్లో చాట్​జీపీటీ కూడా ఒక మెంబర్​లా ఉంటుంది. కానీ, చర్చల్లో పార్టిసిపేట్ చేయదు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి లేదా ఐడియాల కోసం సాయం చేస్తుంది. అలాగే ఎమోజీలు, ప్రొఫైల్​ బేస్డ్​ రియాక్షన్​లతో స్పందించగలదు. చాట్​జీపీటీ యూజర్లు ‘పీపుల్’ లోగోను ట్యాప్​ చేయడం ద్వారా గ్రూప్​ చాట్​ను స్టార్ట్ చేయొచ్చు. లింక్​ ద్వారా 20 మంది వరకు వ్యక్తులను ఇన్వైట్ చేయొచ్చు. ఇందులో కంట్రోల్ ఫీచర్లు, పేరెంటల్​ సేఫ్​గార్డ్స్​ కూడా ఉన్నాయి. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని యూజర్ల నుంచి వచ్చే ఫీడ్​బ్యాక్​ ఆధారంగా గ్రూప్​చాట్​లను మెరుగుపరిచి ఆ తర్వాత రిలీజ్ చేయనున్నట్లు చాట్​జీపీటీ టీం తెలిపింది.