UPSC పరీక్ష ఫెయిలైన చాట్జీపీటీ

UPSC పరీక్ష ఫెయిలైన చాట్జీపీటీ

చాట్జీపీటీ ఫెయిల్ అయింది. యూపీఎస్ సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఓడిపోయింది. ప్రపంచంలోని అన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది, అన్ని సమస్యల్ని పరిష్కరింస్తుంది అన్ని మాటలు అబద్దమయ్యాయి. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వహిచిన ఓ టెస్టులో చాట్ జీపీటీ ఫెయిల్ అయింది. ‘యుపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తావా?’ అని చాట్‌బాట్‌ని అడిగితే.. ‘ఆ పని చాలా కష్టమ’ని జవాబిచ్చింది. 

యుపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2022  క్వశ్చన్ పేపర్ 1 (సెట్ A) నుండి చాట్ జీపీటీని మొత్తం 100 ప్రశ్నలను అడిగారు. వాటిలో 54 ప్రశ్నలకు మాత్రమే చాట్ జీపీటీ సరైన సమాధానం ఇవ్వగలిగింది. ఆ ఎగ్జామ్ లో జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, ఎకాలజీ, జనరల్ సైన్స్, భారతదేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వంటి అనేక అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. కఠినమైన పరీక్షల్లో ఒకటిగా పేరుపొందిన యూపీఎస్ సీ ఎగ్జామ్ తో వరల్డ్ టాప్ ఏఐ చాట్ బాట్ ఓడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.