ఛత్రపతి చెత్త రికార్డ్.. పాపం బెల్లంబాబు

ఛత్రపతి చెత్త రికార్డ్.. పాపం బెల్లంబాబు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా మొదటిరోజు మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ఛత్రపతి' హిందీ రీమేక్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే అన్ని ఏరియాలు కలుపుకుని కేవలం రూ. 50 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టిందని తెలుస్తోంది.

అంతేకాదు కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి జీరో షేర్స్  నమోదయ్యాయని సమాచారం. ఇక రెండో రోజు కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ మధ్య కాలంలో ఏ హిందీ సినిమాకి కూడా ఇంత తక్కువగా కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అయితే.. సినిమా ఫ్లాప్ అయినా కూడా మేకర్స్ కు మాత్రం పెద్దగా నష్టం రాలేదని ఇన్ సైడ్ టాక్.

ఈ సినిమా మేకింగ్ కి దాదాపు 40 కోట్ల అయిందని అంచనా. అయితే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ద్వారా 50 కోట్లు వచ్చాయని వార్తలు వినిపించాయి. ప్రమోషన్స్ ఖర్చు ఇంకో ఐదు కోట్లు అయినా.. మేకర్స్ మాత్రం ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే ఛత్రపతి రిలీజ్ కు ముందే మరో రెండు బాలీవుడ్ మూవీస్ కు సైన్ చేసాడు బెల్లంబాబు. మరి ఎలా చూసుకున్నా.. మేకర్స్ కు మాత్రం ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పాలి.