JEE ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాట్జీపీటీ ఫెయిల్

JEE ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాట్జీపీటీ ఫెయిల్

చాట్జీపీటీ ఫెయిల్ అయింది. యూపీఎస్ సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఓడిపోయింది. ప్రపంచంలోని అన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది, అన్ని సమస్యల్ని పరిష్కరింస్తుంది అన్ని మాటలు అబద్దమయ్యాయి. ఇండియాలో లోని టఫ్ ఇంజినీరింగ్ పరీక్ష అయిన జేఈఈ అడ్వాస్డ్ క్రాక్ చేయడంలో చాట్ జీపీటీ ఫెయిల్ అయింది. 

ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు చాట్ జీపీటీని టెస్ట్ చేశాడు. జేఈఈ పూర్వ ప్రశ్నా పత్రాలను ఉపయోగించి చాట్ జీపీటీ టెస్ట్ పెట్టాడు. మొత్తం రెండు పేపర్లు పరీక్ష పెట్టగా.. అందులో కేవలం 11 ప్రశ్నలకు మాత్రమే చాట్ జీపీటీ జవాబు ఇవ్వగలిగింది. 

గతంలో కూడా చాట్ జీపీటీ ఫెయిల్ అయింది. అనలిటిక్స్ ఇండియ మ్యాగజైన్ నిర్వహించిన యూపీఎస్ సీ ప్రలిమినరీ పరీక్షల్లో చాట్ జీపీటీ ఫెయిల్ అయింది. యుపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2022  క్వశ్చన్ పేపర్ 1 (సెట్ A) నుండి చాట్ జీపీటీని మొత్తం 100 ప్రశ్నలను అడిగారు. వాటిలో 54 ప్రశ్నలకు మాత్రమే చాట్ జీపీటీ సరైన సమాధానం ఇవ్వగలిగింది.