యాపిల్ వాచ్ ద్వారా నేరుగా చాట్జీపీటీ సేవలు

యాపిల్ వాచ్ ద్వారా నేరుగా చాట్జీపీటీ సేవలు

యాపిల్ కంపెనీ టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు తాజా సంచలనం చాట్ జీపీటీని యాపిల్ వాచ్ ల్లో నేరుగా వాడుకునే సదుపాయం కల్పించింది. అంటే చాట్ జీపీటీ సేవల్ని నేరుగా యాపిల్ వాచ్ నుంచి పొందొచ్చు. వాచ్ జీపీటీ పేరుతో ఈ సర్వీస్ ని లాంచ్ చేయనున్నారు యాపిల్ సంస్థ. ఈ సేవల్ని వాయిస్, లేదా ఇన్ పున్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. దీంతో చాట్ జీపీటీ సేవలు మరింత సులభం అవనున్నాయి. 

ఇప్పటివరకు బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్, ఆక్సీజన్ లెవల్స్ లాంటి ఫీచర్లు యాపిల్ వాచ్ లో అందుబాటులో ఉండేవి. ఈ సేవలకోసం సిలికాన్ ఫోటోనిక్స్ అనే ప్రత్యేక చిప్‌తో కలిపి ఆప్టికల్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీని వాడనున్నారు. ఇది హెల్త్ ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.