దర్శకుడు త్రినాథరావు నిర్మాతగా చౌర్య పాఠం.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

దర్శకుడు త్రినాథరావు నిర్మాతగా చౌర్య పాఠం.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

దర్శకుడు నక్కిన త్రినాథరావు(Trinadharao Nakkina) నిర్మాతగానూ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. నక్కిన నరేటివ్స్(Nakkin Naratives) పేరుతో కొత్త బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేశారు.  యంగ్ టాలెంట్‌‌‌‌‌‌‌‌ను ఎంకరేజ్ చేస్తూ శనివారం ఆయన నిర్మిస్తున్న మూవీ టైటిల్, టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి చౌర్య పాఠం(Chowrya Patam) అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, లగడపాటి శ్రీధర్, బెక్కెం వేణుగోపాల్, కోనేరు సత్యనారాయణ, మిర్యాల రవీందర్ రెడ్డి, దర్శకులు చందూ మొండేటి, వైవీఎస్ చౌదరి అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ అవ్వాలని టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అని, ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని త్రినాథరావు చెప్పారు.  కథను అందించిన కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ ఈ చిత్రానికి వర్క్ చేశాడు. డావ్ జాండ్ సంగీతం అందిస్తున్నాడు.