
కొత్త వాళ్లతో తీసిన కోర్ట్, కమిటీ కుర్రాళ్లు చిత్రాల తరహాలో తమ సినిమా కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని అంటున్నాడు ఇంద్రరామ్. తను హీరోగా చేసిన నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘చౌర్య పాఠం’. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఏప్రిల్ 25న సినిమా విడుదల సందర్భంగా హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ సినిమా కాదు. రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా తీశాం. స్టోరీ రైటర్ కార్తిక్ వాళ్ల ఫాదర్ ఐజీగా ఇలాంటి ఓ కేసుని టేకప్ చేశారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి టన్నెల్ తవ్వి దొంగతనం చేశారు.
ఆ ఇన్సిడెంట్‌కు ఫిక్షన్ జోడించి దీన్ని తీయడం జరిగింది. ఇది చాలా డిఫరెంట్ జానర్ సినిమా. దీనికి కథే మెయిన్ హీరో. టన్నెల్స్, ఫిక్షనల్ విలేజ్‌ని క్రియేట్ చేశాం. డైరెక్టర్ నిఖిల్ చాలా క్లియర్‌గా, ప్రతీది ప్లాన్డ్‌గా తీశారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణకు తెలుగు రావడంతో మా వర్క్ ఇంకా ఈజీ అయింది. ఇందులో తన నటన ఆకట్టుకుంటుంది. త్రినాథ్ గారు కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు.