కామారెడ్డి జిల్లాలో వేతనాలు పెంచాలని సీహెచ్సీ సిబ్బంది ధర్నా

కామారెడ్డి జిల్లాలో వేతనాలు పెంచాలని సీహెచ్సీ సిబ్బంది ధర్నా

కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్​తోపాటు,  సీహెచ్​సీల్లో పని చేసే సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో హాస్పిటల్​ ముందు కార్మికులు ధర్నా  నిర్వహించారు.  సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేపట్టారు. 

 కనీస జీతం రూ.26వేలు ఇవ్వాలని,  పీఎఫ్, ఈఎస్​ఐ సౌకర్యం కల్పించాలన్నారు.   5న  వైద్య విధాన పరిషత్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తామని  ప్రతినిధులు పేర్కొన్నారు. ఏఐటీయూసీ స్టేట్ లీడర్​ దశరథ్,  జిల్లా సెక్రటరీ పి.బాల్​రాజు, నాయకులు శ్రీనివాస్, రఫీక్,  లక్ష్మీ, సాజీయా పాల్గొన్నారు.