విదేశాల్లో స్టడీ, జాబ్ఈల పేరిట ఫ్రాడ్ .. ఏపీకి చెందిన నిందితుడు అరెస్ట్

విదేశాల్లో స్టడీ, జాబ్ఈల పేరిట ఫ్రాడ్ .. ఏపీకి చెందిన నిందితుడు అరెస్ట్
  •     నల్గొండ  ఏఎస్పీ రమేశ్  వెల్లడి

దేవరకొండ(చింతపల్లి), వెలుగు: విదేశాల్లో స్టడీ, జాబ్ ల పేరిట మోసగించిన ఒకరిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ రమేశ్​శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లికి చెందిన ముప్పాళ్ల లీలా కృష్ణ (33), జల్సాలకు అలవాటు పడి యువతను లక్ష్యంగా చేసుకుని విదేశాల్లో చదువు,జాబ్ లు ఇప్పిస్తానని నమ్మిస్తున్నాడు. ముందుగా డబ్బులు తీసుకుని, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడం, వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా తప్పుడు సమాచారం పంపిస్తున్నాడు.  

నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 8 మంది నిద్యోగుల నుంచి  రూ. 85 లక్షలు తీసుకున్నాడు. చింతపల్లి మండలం పోలేపల్లి పరిధి రాంనగర్ కు చెందిన కోయల కరుణ బాయి తన కొడుకుకు ఫారెన్ లో జాబ్ ఇప్పిస్తానని భారీగా డబ్బులు తీసుకుని లీలా కృష్ణ మోసగించినట్టు చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి సీఐ రాజు,ఎస్ఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం మాల్ పరిధి మర్రిగూడ రోడ్డులో అనుమానాస్పదంగా కనిపించగా లీలాకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. 

 నిందితుడి వద్ద 3 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, పలు బ్యాంకుల డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించి, రివార్డులు అందించారు.