
షాద్ నగర్, వెలుగు: ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం కేశంపేటలో బీజేపీ బూత్ స్థాయి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలన్నారు. కేసీఆర్మీద కోపంతో జనం కాంగ్రెస్ ను గెలిపించారని, పదేండ్లుగా బీజేపీ పోరాటాలు చేస్తుంటే కాంగ్రెస్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.