చెక్ డ్యాం పనులు వెరీ స్లో

చెక్ డ్యాం పనులు వెరీ స్లో
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో 24 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంలకు 7 మాత్రమే పూర్తి

రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చెక్ డ్యాం నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. ఓ వైపు వానకాలం తరుముకొస్తుండగా పనులు స్లోగా సాగుతుండడంతో నీటిని నిల్వ చేసే అవకాశం లేక సాగునీటి కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు 2021లో నాటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 24 చెక్​ డ్యాం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది.

24 చెక్ డ్యాముల్లో మూడేండ్లుగా కేవలం ఏడు మాత్రమే పూర్తయ్యాయి. మరో 17 చెక్​ డ్యాం వివిధ దశల్లో పెండింగ్​లో ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.  ఈ నిర్మాణాలు పూర్తయితే భూగర్భ జలాలు పెరగడంతోపాటు కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముంటుంది. 

17 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంలు పెండింగ్ లోనే

జిల్లాలో చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణాలను ఏడాది లోపే పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలను నాటి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించింది. ఈ మేరకు పనులు ప్రారంభించిన కాంట్రాక్ట్​సంస్థలు కేవలం 7 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంలను పూర్తిచేశాయి. మూడేండ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో నేటికీ పనులు పూర్తికాలేదు. కనీసం ఈ ఎండాకాలంలోనైనా పనులు స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో కాంట్రాక్ట్ సంస్థలు పనులను వేగవంతం చేయడం లేదు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, జయవరం, మల్లారం మూడు గ్రామాలలో చెక్​ డ్యాం పనులు మూడేండ్లుగా సాగుతూనే ఉన్నాయి.

కోనారావుపేట మండలం మూలవాగుపై మరిమడ్ల, నిమ్మపల్లి, కొండాపూర్, వెంకట్రావుపల్లి, నిజామాబాద్, మామిడిపల్లి గ్రామాల మధ్య చేపట్టిన చెక్ డ్యాంలు కనీసం 60 శాతం పనులు కూడా పూర్తికాలేదు. వెంకట్రావుపల్లి–మామిడిపల్లి గ్రామాల మధ్య చెక్ డ్యాంలు ఇంకా బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలోనే ఉన్నాయి. బోయినిపల్లి మండలం మన్వాడ, మల్లాపూర్  గ్రామాల పరిధిలో మిడ్ మానేరు ప్రాజెక్ట్  కిందిభాగంలో రెండు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. కాగా గతంలో కింది భాగంలో నీరుండడంతో పనులు వాయిదా వేస్తూ వచ్చిన కాంట్రాక్టర్.. ఈసారి నీరు లేకపోయినా పనులు చేపట్టలేదు. 

పూర్తయిన వాటిల్లోనూ నాణ్యతా లోపాలు 

జిల్లాలో చేపట్టిన 24 చెక్ డ్యాముల్లో 7 మాత్రమే పూర్తయ్యాయి. గంభీరావుపేట మండలం నర్మాల, ఎల్లారెడ్డిపేట మంలం సింగారం, వీర్నపల్లి మండలం గర్జనపల్లి, కోనరావుపేట మండలం కొలనూర్, నిజాంబాద్, వేములవాడ అర్బన్ మండలం కేంద్రంలో చెక్​డ్యాంలు పూర్తయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలం మానేరు వాగుపై పదిర గ్రామంలోని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంను లోపభూయిష్టంగా నిర్మించడంతో నీరు లీకవుతోంది. వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామంలో నిర్మాణ దశలో ఉండగా గతేడాది వానకాలం వరదలకు కొట్టుకుపోయింది. దీనిపై గతంలో బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఆందోళనలు కూడా చేశారు.  

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ బ్రిడ్జి, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, పదిర, తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూర్, ముస్తాబాద్ మండలం పెద్దూర్, సాయినగర్, కోనరావుపేట మండలం మరిమడ్ల, నిమ్మపల్లి, వెంకట్రావుపేట, మామిడిపల్లి, వేములవాడ మండలం మల్లారం, తిమ్మాపూర్, మహాలక్ష్మి టెంపుల్, బొల్లారం, జయవరం గ్రామాల్లోని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాం నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.  జిల్లాలో చెక్ డ్యాం పనులు సాగదీతపై ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవతీసుకోవాలని రైతులు కోరుతున్నారు.