సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 రూమర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్

సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 రూమర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెక్

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘కల్కి 2898 ఎడి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ప్రభాస్. మరోవైపు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తెరకెక్కుతోంది. ఇక ‘సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2: శౌర్యాంగపర్వం’తో పాటు ‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’కి సంబంధించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రకరకాల కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందనేది దాని సారాంశం. 

ఆ సినిమాను పక్కన పెట్టేయడం వల్లే ఆగస్టు నుంచి ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాను ప్రశాంత్ నీల్ పట్టాలెక్కిస్తున్నాడనే ప్రచారం దానికి తోడైంది. ఈ సినిమా రద్దు అవుతోందన్న రూమర్స్ ఊపందుకోవడంతో ‘సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ మేకర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో ఓ ఫన్నీ ఫొటోను పోస్ట్ చేశారు. ‘సలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీసిన స్టిల్ అది. ఇందులో హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏదో సందర్భంలో నవ్వుతున్నారు. ‘వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ రూమర్స్ నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫొటోతో బదులిస్తూ ఈ ప్రచారానికి చెక్ పెట్టారు మేకర్స్.