సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం..గేదెపై దాడి

 సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం..గేదెపై దాడి

అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు  జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆహార వేటలో భాగంగా గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. సాధుజంతువులు, మనుషులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట్ మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

నాగంపేట గ్రామంలో చిరుత పులి సంచరించింది. ఓ గేదెపై దాడి చేసింది. పంగ బాబు అనే రైతు తన చేను వద్ద గేదెను కట్టేశాడు. అయితే దానిపై చిరుత దాడి చేసింది, చిరుత పులి దాడిలో  గేదె తీవ్రంగా గాయపడింది. చిరుత సంచారంతో గ్రామస్తులు, రైతులు  భయాందోళలకు గురవుతున్నారు. చిరుతకు సంబంధించిన సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు.