భోళా శంకర్ మూవీ టికెట్ల పెంపుపై ..మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రెస్పాండ్

భోళా శంకర్ మూవీ టికెట్ల పెంపుపై ..మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రెస్పాండ్

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం భోళా శంకర్. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు11న) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా టిక్కెట్ల పెంపుపై ఇంకా సందిగ్దత నెలకొంది.  లేటెస్ట్ గా టికెట్ ధరల పెంపుపై ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. భోళా శంకర్ మూవీ టిక్కెట్ ధరలను పెంచాలని తమ వద్దకు దరఖాస్తు వచ్చిందని చెపుతూ.. అయితే 12 అంశాలపై ప్రభుత్వం స్పష్టతను కోరిందని వెల్లడించారు. కానీ ఇంత వరకు మూవీ టీం నుంచి ఎటువంటి రెస్పాండ్ రాలేదని మంత్రి వేణు తెలిపారు. 

ఇక రేసేంట్ గా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీకు టికెట్ రేట్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. భోళా శంకర్ మూవీ రూ.101 కోట్లతో సినిమా నిర్మాణం జరిగిందని చెప్పారని.. జీఎస్టీ, బ్యాంక్ స్టేట్మెంట్ లు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్, షూటింగ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ వివరాలు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. 12 అంశాలపై ప్రభుత్వం క్లారిటీ అడిగిందని.. చిత్ర యూనిట్ వివరణ ఇవ్వలేదని పేర్కొన్నారు. 

అయితే ఇపుడు లేటెస్ట్ మూవీ భోళా శంకర్ నుంచి..చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో రేట్లు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కానీ, కొందరు ఈ భోళాశంకర్ సినిమాను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నం ఇకనైనా విరమిస్తే మంచిదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. 

ప్రసెంట్ సినీ ఇండస్ట్రీతో..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫైటింగ్ మరింత ముదిరిగింది. మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో మొదలైన వివాదం..ఇక సినిమా రిలీజ్ విషయంలో..టికెట్ల పెంపు విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 
కాగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ తో గొడవ పీక్ స్టేజ్ కు వెళ్లింది..సినిమా వాళ్లు అయితే ఏంటీ.. వాళ్లేమయినా దేవుళ్లా.. ఆకాశం నుంచి ఊడిపడ్డారా అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.