కెమిస్టులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి : డ్రగ్ ఇన్‌‌ స్పెక్టర్ గోవింద్ సింగ్

కెమిస్టులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి : డ్రగ్ ఇన్‌‌ స్పెక్టర్ గోవింద్ సింగ్
  •     డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్ గోవింద్ సింగ్

హైదరాబాద్, వెలుగు: కెమిస్టులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని అంబర్‌‌ పేట్ డ్రగ్ ఇన్‌‌ స్పెక్టర్ గోవింద్ సింగ్, బేగంపేట డ్రగ్ ఇన్‌‌స్పెక్టర్ సురేంద్రనాథ్, ప్రొఫెసర్ ముజీబ్  సూచించారు. అంబర్‌‌ పేట్ కెమిస్ట్స్ అండ్  డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రజాపాలన సదస్సు నిర్వహించారు. అంబర్‌‌ పేట్ తహసీల్దార్​ ఆఫీసు నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మవద్దన్నారు. 

నకిలీ మందులను అరికట్టేందుకు క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిని పాటించాలన్నారు. వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సీనియర్ కెమిస్టులను సన్మానించారు. డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ దాస్, అడిషనల్ డైరెక్టర్ సరిత, అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణా రెడ్డి, రమేశ్, శివ కుమార్ పాల్గొన్నారు.