చేనేత బతుకమ్మ సంబురాలు

చేనేత బతుకమ్మ సంబురాలు

పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి చేనేత బతుకమ్మ సంబురాలు జరపనున్నారు. వేడుకల పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం తన నివాసంలో ఆవిష్కరించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర సర్కారు 8 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కవిత అన్నారు. రైతు బీమా మాదిరిగానే చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఏటా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూకే ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నామని వెల్లడించారు.