ఎంఆర్​ఎఫ్ లాభం​ రూ. 509 కోట్లు

ఎంఆర్​ఎఫ్ లాభం​ రూ. 509 కోట్లు

న్యూఢిల్లీ : టైర్లు తయారు చేసే  చెన్నై బేస్డ్‌​ కంపెనీ ఎంఆర్​ఎఫ్​ లిమిటెడ్ అక్టోబర్-–డిసెంబర్ 2023 క్వార్టర్​లో  కన్సాలిడేటెడ్​ లెక్కన రూ. 509.71 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.174 కోట్ల లాభం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలానికి, కన్సాలిడేటెడ్ లాభం ఏడాది క్రితం నమోదైన రూ.428.29 కోట్లతో పోలిస్తే రూ.1,685.12 కోట్లకు పెరిగింది. తాజా క్వార్టర్​లో  మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్​) రూ. 6,240.08 కోట్లకు పెరిగింది. 

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.5,715.91 కోట్లు వచ్చాయి. డిసెంబర్ 31, 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి మొత్తం ఆదాయం రూ. 19,042.88 కోట్లు ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో రూ. 17,349.66 కోట్లు వచ్చాయి. డైరెక్టర్ల బోర్డు ఈక్విటీ షేర్‌‌కు  రూ. 3 చొప్పున రెండవ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనిని వచ్చే నెలలో చెల్లిస్తామని కంపెనీ తెలిపింది.