చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ చెస్ టోర్నమెంట్‌‌లో అర్జున్‌‌కు అరవింద్‌‌ చెక్‌‌

చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ చెస్ టోర్నమెంట్‌‌లో అర్జున్‌‌కు అరవింద్‌‌ చెక్‌‌

చెన్నై: ఇండియా టాప్ గ్రాండ్ మాస్టర్‌‌‌‌, వరల్డ్ నం.2 ఎరిగైసి అర్జున్‌‌ చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ చెస్ టోర్నమెంట్‌‌లో తొలి ఓటమి ఎదుర్కొన్నాడు. ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌‌ గేమ్‌‌లో ఇండియాకే చెందిన గ్రాండ్‌‌మాస్టర్‌‌‌‌ అరవింద్ చిదంబరం 48 ఎత్తుల్లో అర్జున్‌‌ను ఓడించాడు. అరవింద్‌‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ రౌండ్‌‌లో ఓడినా అర్జున్‌‌, అమెరికా స్టార్ లెవోన్ అరోనియన్‌‌తో కలిసి నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదే రౌండ్‌‌లో అరోనియన్‌‌.. ఇండియా జీఎం విదిత్ సంతోష్‌‌తో గేమ్‌‌ను 70 ఎత్తుల వద్ద  డ్రా చేసుకున్నాడు. చాలెంజర్స్‌‌ కేటగిరీలో ద్రోణవల్లి హారిక, రౌనక్‌‌ సాధ్వాని మధ్య గేమ్ డ్రా అయింది.