వారెవ్వా.. ఏందిరా ఈ ఆచారం... ఆ గుళ్లో ప్రసాదంగా పిజ్జా.. బర్గర్ .. నయా ట్రెండ్..!

వారెవ్వా.. ఏందిరా ఈ ఆచారం... ఆ గుళ్లో ప్రసాదంగా  పిజ్జా.. బర్గర్ .. నయా ట్రెండ్..!

భారతీయ దేవాలయాలలో ప్రసాదం పంచిపెట్టడం సంప్రదాయం ..  కొన్ని ఆలయాలు పిల్లల ఆరోగ్య, దీర్ఘాయుష్షు కోసం తల్లిదండ్రుల మొక్కులకు అనుగుణంగా ఆధునిక ఆహారాలైన పిజ్జా, బర్గర్‌లను ప్రసాదంగా అందిస్తున్నారు.  చెన్నైలోని జై దుర్గా పీఠం ఈ వినూత్న సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అసలు ఈ ప్రసాదం పెట్టడానికి కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ..

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటారు.   చిన్న పిల్లలు.. సినిమాలకు.. షికార్లకు వెళ్ళేందుకు చూపినంత ఇంట్రస్ట్​ గుళ్లకు వెళ్లుందుకు చూపరు.  దీంతో కొందరు పిల్లలతో మొక్కులు తీర్చలేక అనేక ఇబ్బందులు పడేవారు.   దీనికోసం చెన్నై సమీపంలోని పడప్పాయ్‌లో ఉన్న జై దుర్గా పీఠం ఆలయం నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు.

 హిందువులు ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.ఆలయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించే పులిహోర, దద్దోజనం, లడ్డూ, పరమాన్నం, పాయసం లాంటి వంటకాలు అంటే ఇష్టపడని వారుండరు. ఆ ప్రసాదాన్ని కళ్లకి అద్దుకుని తీసుకుంటాం.  కాని పిల్లలు  పిజ్జా, బర్గర్ వంటి ఫుడ్​ తింటానికి ఎక్కువుగా ఇష్టపడుతుంటారు.  అందుకే పిల్లలకు ఇష్టమైన వాటిని ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

Also Read : ప్రమోషన్ కోసం.. వ్యాపారాభివృద్దికి.. సంకష్ట హర చతుర్ది

 ఈ ఆలయాన్ని హెర్బల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్  నెలకొల్పారు. ఇక్కడికి రెగ్యులర్‌గా వచ్చే భక్తులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కూడా ఆలయ కమిటీ కల్పించింది. తమ పిల్లల పుట్టినరోజులను ఆలయంలో నమోదు చేసుకుంటే...  ఆ రోజున ప్రత్యేకంగా కేక్‌ను కట్ చేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

 ఈ ఆలయంలోని  ప్రసాదాలను ఆలయ పవిత్ర వంటగదిలో స్వచ్ఛతతో తయారు చేస్తారు.. వీటికి FSSAI సర్టిఫికేషన్ కూడా ఉండటంతో పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా దేవతలు కూడా వీటిని నైవేద్యంగా స్వీకరిస్తారనే భావనతో ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు తెలిపారు.

పిల్లలు గుడికి వచ్చినప్పుడు సంప్రదాయ స్వీట్లు తినడానికి ఇష్టపడరు. కానీ వారికి పిజ్జా బర్గర్లు చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. అందుకే దేవత కూడా ఆధునిక పిల్లల ఆహారాన్ని అంగీకరిస్తుంది అనే భావనతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీనివల్ల పిల్లలు సంతోషంగా ఆలయానికి వస్తారు. తల్లి చేసిన ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా దేవాలయాలు కూడా నూతన సంప్రదాయాలను పాటిస్తూ ఆకర్షణ కేంద్రాలుగా నిలుస్తున్నాయి.

గతంలో ఇక్కడ కొబ్బరి, చక్కెరతో చేసిన ప్రసాదమే అందించేవారు. అయితే గుడికి వచ్చే పిల్లలు సాంప్రదాయ స్వీట్లను తినడానికి ఇష్టపడకుండా మొండికేయడంతో  పిల్లలు సంతోషంగా గుడికి రావాలని, ప్రసాదం స్వీకరించాలని ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలు ఇష్టపడే పిజ్జా, బర్గర్  ప్రసాదంగా పెట్టాలని భావించింది. దీంతో భక్తులు ఈ ఆహారాలను స్వయంగా తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, తిరిగి వాటిని పిల్లలకు సంతోషంగా ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ దేవాలయం  చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు  44 కిలోమీటర్ల దూరంలో ఈ బర్గర్ దేవాలయం ఉంది.