ప్రమోషన్ కోసం.. వ్యాపారాభివృద్దికి.. సంకష్ట హర చతుర్ది( డిసెంబర్8)న పాటించాల్సిన నియమాలు.. పూజావిధానం ఇదే..!

ప్రమోషన్ కోసం.. వ్యాపారాభివృద్దికి.. సంకష్ట హర చతుర్ది( డిసెంబర్8)న పాటించాల్సిన నియమాలు.. పూజావిధానం ఇదే..!

 మార్గశిర మాసంలో వచ్చే సంకష్ట చతుర్ది రోజుకు చాలా విశిష్టత.. ప్రాధాన్యత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఈ ఏడాది మార్గశిరమాసంలో సంకష్ట హర చతుర్ది డిసెంబర్​ 8 వ తేది వచ్చింది.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ... ఆరోజు వినాయకుడిని ఎలా పూజించాలి.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో  స్టోరీలో తెలుసుకుందాం. . .! 

సంకష్టహర చతుర్ధి  (2025 డిసెంబర్​ 8) నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితం కనపడుతుంది. సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.  ఇది అడ్డంకులను తొలగించే రోజని పండితుల ద్వారా తెలుస్తుంది. ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 

  
గణేశుడి అనుగ్రహం కోసం ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు. సంకటహర అనే పదం సంస్కృత పదాలైన 'సంకట' అంటే ఇబ్బందులు లేదా అడ్డంకులు హర అంటే తొలగింపు నుండి వచ్చింది. అందువల్ల, సంకటహర చతుర్థి అనేది జీవితంలోని సవాళ్లను తొలగించడానికి గణేశుడికి అంకితం చేయబడిన రోజని పండితులు చెబుతున్నారు.

మార్గశిరమాసం (2025) సంకష్టహర చతుర్థి ముహూర్తం
పంచాంగం ప్రకారం  మార్గశిరమాసం కృష్ణపక్షం చతుర్థి తిధి  2025 డిసెంబర్‌  7వ తేదీ ఆదివారం  సాయంత్రం 6.25 నిమిషాలకు ప్రారంభమవుతుంది.  మరుసటి రోజు అంటే డిసెంబర్‌ 8వ తేదీ సాయంత్రం 04.03 గంటలకు చతుర్థి తిథి ముగుస్తుంది. అయితే.. సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట గరికతో పూజిస్తే విశేషంగా భావిస్తారు. 

సంకటహర చతుర్థి పూజా ఫలితాలు

  • సంకటహర చతుర్థి పూజ చేస్తే అడ్డంకులు తొలగిపోతాయి.
  • కోరిన కోరికలు నెరవేరుతాయి.
  • సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.
  • కుటుంబంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి.
  • ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • మానసిక శాంతిని కలిగిస్తుంది.
  • వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది.
  • విద్యార్థులకు విద్యాభ్యాసంలో మెరుగుదల ఉంటుంది.
  • ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి.
  • పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. 
  •  ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
  • కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి.
  • మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి.
  • ఆనందం, సంతోషం కలుగుతాయి.
  • మోక్షం లభిస్తుంది.

ఎలా పూజ చేయాలంటే..!

  • ఉదయాన్నే తల స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించండి.
  • పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఏర్పాటు చేసి, పూలు, పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించండి.
  • పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యంగా సమర్పించండి.
  • వినాయకుడికి సాయంత్రం పువ్వులు, గరికను సమర్పించండి. -  
  • "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని జపించండి.సంకష్టహర చతుర్ధి నాడు వినాయకుని మంత్రాలు, స్తోత్రాలు చదువుకోవాలి
  • ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
  • ధూప, దీప, నైవేద్యాలతో వినాయకుడిని ఆరాధించాలి.
  • సాయంత్రం సంకష్ట వ్రత కథను చదివినా లేదా విన్నా మంచి ఫలితం ఉంటుంది.
  • సాయంత్రం చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాత ఉపవాసాన్ని ముగించాలి.
  • సంకష్టహర చతుర్ధి వ్రతాన్ని మూడు, ఐదు, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తే మంచిది.


సంకష్టహర చతుర్ధి నాడు పేదలకు గోధుమలు, బియ్యం, పప్పులు వంటివి దానం చేస్తే మంచిది. అలాగే పండ్లు, స్వీట్లు, దుస్తులు, దుప్పట్లు, నెయ్యి వంటివి కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి. దానం చేసిన ఫలితం కలగాలంటే చేసిన దానం గురించి ఎవరికీ చెప్పుకోకూడదు. రహస్యంగా దానం చేయాలని పండితులు  చెబుతున్నారు.

►ALSO READ | యాదిలో..ఆధ్యాత్మికతను వృద్ధి చేసిన వీరుడు .. జైనమతాన్ని పునరుద్ధరించిన తీర్థంకరుడు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.