యాదిలో..ఆధ్యాత్మికతను వృద్ధి చేసిన వీరుడు .. జైనమతాన్ని పునరుద్ధరించిన తీర్థంకరుడు

యాదిలో..ఆధ్యాత్మికతను వృద్ధి చేసిన వీరుడు ..  జైనమతాన్ని పునరుద్ధరించిన తీర్థంకరుడు

వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని పునరుద్ధరించిన ఇరవై నాలుగో తీర్థంకరుడు. వైదిక శకంలోని తీర్థంకరుల ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక బోధనలను ఆయన వివరించాడు. వర్ధమాన అంటే వృద్ధి చెందడం. పేరుకు తగినట్టే ఈయన ఆధ్యాత్మికంగా ఇంకా అభ్యున్నతి సాధించే సమర్థత గలవాడు. ఆయన చేసే అన్ని పనుల్లోను మంచినే కాంక్షిస్తాడు. 

ఏది మంచిదో, ఏది కాదో త్వరగా గ్రహిస్తాడు. అప్పటి బ్రాహ్మణ బోధనలలో అరితర్వర్తిత్వము ఒప్పుదల విలువ నుంచి నిష్క్రమణ అనేదాన్ని మొదట అన్నది ఆయనే. ఆధ్యాత్మిక విముక్తికి అహింస, సత్యం, అస్తేయ (దొంగతనం చేయకపోవడం), బ్రహ్మచర్యం, అపరిగ్రహ (అనుబంధం లేకుండా ఉండడం) అవసరమని తెలిపాడు. 

వీటిలో నాలుగు పార్శ్వనాథుడు ప్రతిపాదించాడు. బ్రహ్మచర్యం అనేది వర్ధమానుడు కలిపాడు. వీటిని పంచవ్రతాలు అంటారు. వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది. ఈయన బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. అనేకతవాద, శ్యాదవాద, నయావాద సూత్రాలను బోధించాడు.

 పవిత్రమైన జీవనం గడుపుతూ తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందొచ్చని బోధించాడు. మహావీరుడి బోధనలను అతి ప్రధాన శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జైన ఆగమాల పేరుతో సంకలనం చేశాడు. వర్ధమానుడు తనకు జ్ఞానోదయమయ్యాక మహావీరుడిగా పేరుగాంచాడు. ఈయన భార్య పేరు యశోద. కూతురు ప్రియదర్శి. వర్ధమానుడు 30వ ఏట సాధారణ జీవితాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. 

ఆరేండ్లు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తర్వాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబి గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. 43వ ఏట సాల వృక్షం కింద తపోసిద్ధిని పొందాడు. తర్వాత వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. చివరిగా ఉత్తరప్రదేశ్​లోని పాగపురిలో నిర్యాణం పొందాడు. ఈయన ఒకసారి ‘‘.. గురువులు తగని దానిని తగినదానిగా తీసుకోవడం చూశాను. 

గౌరవంలేనిదాన్ని గౌరవించడం చూశాను” అంటాడు. అలాగే ‘‘నేను బ్రాహ్మణుల నుంచి విభేదించి రూపొందటానికి కొత్త ప్రయత్నాన్ని బోధించాలనుకున్నా. ఇక్కడ నేను, నా తోటి వారి నుంచి విభేదిస్తున్నానని నాకు తెలుసు. ఎందుకంటే నేనూ బ్రాహ్మణుడినే. సహజంగా అందరూ అనుకుంటున్నట్టు నేను క్షత్రియుడిని కాదు. నేను క్షత్రియ వంశానికి చెందిన వాణ్ణి. అదే బ్రాహ్మణ, మీకు తెలిసినట్టుగా ఎవరైతే చాలా ఇతర కశ్యప, లేక కాశప బ్రాహ్మణులను ఎరుగుదురో అది. నేను ఇక్కడికి నా పునర్జన్మలో భారతదేశానికి వచ్చాను”అని ఆచారాంగా సూత్ర 3, 5లో అంటాడు. 

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-