దళితులపై కామెంట్స్ చేసిన నటి అరెస్ట్

V6 Velugu Posted on Aug 09, 2021

చెన్నై: తమిళ వర్ధమాన నటి, బిగ్‌ బాస్‌ ఫేం మీరా మిథున్‌ను చెన్నై పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్‌ చేశారు. సినిమా రంగం నుంచి షెడ్యూల్‌ కులాలకు చెందిన దర్శకులు, నటులను గెంటేయాలంటూ ఆమె ఓ వీడియోను ఈనెల 7న ట్వీట్‌ చేయడం కలకం రేపింది. ఓ దర్శకుడు తన అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తూ షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా అవమానకరమైన పదాలను ఉపయోగించింది. ఈ వ్యాఖ్యలపై విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. మీరా మిథున్‌ వీడియో వైరల్‌ కావడంతో ఆమెను అరెస్ట్‌ చేయాల్సిందిగా పలువర్గాలు డిమాండ్ చేస్తుండడంతో వివాదంపై చెన్నై పోలీసులు స్పందించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ సెక్షన్ల కింద కేసులో అరెస్ట్‌ చేశారు.


 

Tagged Chennai police, Meera Mithun, , kollywood actress, Bigg Boss Contestant, comments against dalit, booked for casteist remarks

Latest Videos

Subscribe Now

More News