కటకటాల్లో కీచక ప్రొఫెసర్.. పలు సెక్షన్ల కింద శిక్ష వధించిన చెన్నై మెజిస్ట్రేట్

కటకటాల్లో కీచక ప్రొఫెసర్.. పలు సెక్షన్ల కింద శిక్ష వధించిన చెన్నై మెజిస్ట్రేట్

చెన్నైలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్ ను ఇవాళ (ఏప్రిల్ 4) సైదాపేటలోని మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు హరి పద్మన్ ను దోశిగా గుర్తించి అతనిపై ఐపీసీ సెక్షన్ 509, 354(A), సెక్షన్ 4, హరాస్మెంట్ ఆఫ్ విమన్ ప్రివెన్షన్ యాక్ట్ కింద శిక్ష వేసింది. దాంతో చెన్నై పోలీసులు అతన్ని జైలుకు తరలించారు.

ఇదిలావుండగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులను నిర్దోషులుగా తేలేవరకు, వాళ్లను రిమాండ్ లోనే ఉంచాలని తమిళనాడు మహిళా కమిషన్ పోలీసులను డిమాండ్ చేసింది.

చైన్నై సాంప్రదాయ కళను బోధించే ప్రతిష్టాత్మక ‘కళాక్షేత్ర ఫౌండేషన్’లో పనిచేస్తున్న ప్రొఫెసర్ హరి పద్మన్.. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని దాదాపు 200 మందికి పైగా స్టూడెంట్లు ఆందోళన చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని,  బాడీ షేమింగ్ చేస్తున్నారని, తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యర్థులు గతంలో ప్రొఫెసర్ పై ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సుమారు 90 మంది స్టూడెంట్స్ రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం ఫిర్యదును అందజేసింది. ఈ ఫిర్యాదులు అందుకున్న పోలీసులు శనివారం ప్రొఫెసర్ ని అదుపులోకి తీసుకున్నారు.