కామారెడ్డి, వెలుగు: ది చెన్నై షాపింగ్ మాల్ నూతన బ్రాంచిని కామారెడ్డిలో ప్రారంభించారు. శుక్రవారం 36వ షోరూంను ప్రముఖ యాంకర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. లక్షలాది డిజైన్లతో వస్త్రాలు ఈ షోరూం ద్వారా కామారెడ్డి ప్రజల చెంతకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మర్రి రిటైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకటరెడ్డి, డైరెక్టర్ కృష్ణారావు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, కౌన్సిలర్ గుంట లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
