ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య స్టేడియంలోనే కాదు.. మైదానం బయట కూడా పెద్ద యుద్ధమే కొనసాగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగేటప్పుడు హోస్ట్ టీమ్ డీజే వ్యవహరించిన తీరుపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణాది సంస్కృతిని, ముఖ్యంగా తమిళనాడు అస్తిత్వాన్ని కించపరిచేలా పాటలు ప్లే చేశారంటూ బీసీసీఐ (BCCI)కి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది.
వివాదానికి అసలు కారణం:
ఏప్రిల్ 5వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా స్టేడియంలోని డీజే “దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ” అనే సాంగ్ ని ప్లే చేశాడు. సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్లపై మీమ్స్ వేయడానికి ఎక్కువగా ఉపయోగించే ఈ పాటను ప్లే చేయడంతో తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని, తమిళ సంస్కృతిని కించపరచడమేనని చెన్నై సూపర్ కింగ్స్ పేర్కొంది. ఇది ఒక వర్గాన్ని కించపరిచేలా ఉంది, మంచి పద్ధతి కాదని సీఎస్‌కే తన ఫిర్యాదులో తెలిపింది.
ప్లేయర్లపై వ్యాఖ్యలు:
కేవలం పాటలు మాత్రమే కాదు, చెన్నై ప్లేయర్లు ఔట్ అయినప్పుడు డీజే మైక్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రత్యర్థి జట్టు ప్లేయర్స్ ని అవమానించేలా కామెంట్స్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ సీరియస్ అయ్యారు. సాధారణంగా హోమ్ టీమ్ డీజేలు తమ జట్టుకు సపోర్టు ఇస్తారు, కానీ ఇక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లను కించపరిచేలా పని చేశారు. దీనిపై బీసీసీఐకి లేఖ రాశామని ఆయన తేల్చి చెప్పారు.
పాత గొడవలే మళ్ళీ స్టార్ట్:
ఈ వివాదానికి 2025లో జరిగిన ఒక సంఘటనతో సంబధం ఉంది. అప్పట్లో ఆర్‌సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఇదే పాటను పాడుతూ ఒక వీడియో చేయగా, దానికి కౌంటర్‌గా చెన్నై డీజే కూడా గతంలో పలుమార్లు సెటైర్లు వేసింది. ఆ తర్వాత సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తమ స్టాఫ్‌ను నియంత్రించి, ఎవరినీ కించపరచొద్దని ఆదేశాలు జారీ చేశామని విశ్వనాథన్ వెల్లడించారు. తాము గౌరవప్రదంగా ఉంటున్నా, ఆర్సీబీ డీజే మాత్రం మళ్ళీ పాత గొడవలను రేపారని చూస్తుందని పేర్కొన్నారు.
►ALSO READ | MI vs PBKS మ్యాచ్కి వర్షం ముప్పు?.. ముంబై వెదర్ రిపోర్ట్ ఇవే!
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రియాక్షన్:
ఈ వ్యవహారంపై ఐపీఎల్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. సీఎస్‌కే నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది, ప్రస్తుతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది.. స్టేడియాల్లో వినోదం పేరుతో ప్రాంతీయ వివక్షను ప్రోత్సహించేలా పాటలు ఉండొద్దని రూల్ ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్‌సీబీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సీఎస్‌కే మాత్రం 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఈ రసవత్తర పోరు ఇప్పుడు బీసీసీఐ వద్దకు చేరుకుంది.

