ట్రైనీ ఐపీఎస్ పిటిషన్‌‌పై పోలీసులకుహైకోర్టు నోటీసులు

ట్రైనీ ఐపీఎస్ పిటిషన్‌‌పై పోలీసులకుహైకోర్టు నోటీసులు
  • అరెస్టు నుంచి రక్షణకు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: తోటి ట్రైనీ ఐపీఎస్​పై  లైంగిక వేధింపుల ఆరోపణలతో అత్తాపూర్ పీఎస్​లో తన పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ  ఉదయ్‌‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌పై వివరణ ఇవ్వాలని  పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలన్న ఉదయ్​ అభ్యర్థనను   తిరస్కరిస్తూ కేసు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. జస్టిస్ శ్రీనివాసరావు ఎదుట పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదులో చేసిన ఆరోపణలను ధ్రువీకరించకుండానే పోలీసులు ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. న్యాయమూర్తి వారికి నోటీసులు జారీ చేసి ఉదయ్‌‌కృష్ణారెడ్డికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించారు.