V6 News

MI vs PBKS మ్యాచ్కి వర్షం ముప్పు?.. ముంబై వెదర్ రిపోర్ట్ ఇవే!

MI vs PBKS మ్యాచ్కి వర్షం ముప్పు?.. ముంబై వెదర్ రిపోర్ట్ ఇవే!

MI vs PBKS: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కాసేపట్లో (2026, ఏప్రిల్ 16న) ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. పాయింట్ల పట్టికలో వెనుకబడిన హార్దిక్ పాండ్యా సేనకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ఈ కీలక పోరుకు వాతావరణం సహకరిస్తుందా? టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకోవాలి? అనేదానిపై ఉత్కంఠ రేపుతుంది. 

వాతావరణ నివేదిక: 
క్రికెట్ ప్రేమికులకు తీపి కబురు! నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పు అస్సలు లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక పగటిపూట 35°C ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభ సమయానికి (రాత్రి 7:30 గం.) ఉష్ణోగ్రత (27°C - 28°C)లు తగ్గే అవకాశం ఉంది. అలాగే, ముంబై కోస్తా ప్రాంతం కాబట్టి 70 శాతం వరకు తేమ ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్లకు ఉక్కపోత అధికంగా ఉండవచ్చు.

►ALSO READ | కాసేపట్లో పంజాబ్ vs ముంబై మధ్య కీలక పోరు.. ఏ జట్టు గెలుస్తుందో తెలుసా!

మంచు ప్రభావం: 
ముంబై నగరంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం విపరీతంగా ఉంటుంది. మైదానం తడిగా మారడం వల్ల బౌలర్లకు బంతిపై పట్టు (Grip) దొరకడం కష్టమవుతుంది. ఇది బ్యాటర్లకు అదనపు ప్రయోజనంగా మారుతుంది.

పిచ్ రిపోర్ట్: 
వాంఖడే స్టేడియం అంటేనే 'బ్యాటింగ్ ప్యారడైజ్'. ఎర్ర మట్టితో కూడిన ఈ పిచ్‌పై బంతి చక్కగా బ్యాట్‌పైకి వస్తుంది. ఇక్కడ బౌండరీ లైన్స్ చిన్నవిగా ఉండటంతో పాటు అవుట్‌ఫీల్డ్ మెరుపు వేగంతో ఉండటంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురియడం ఖాయంగా కనిపిస్తుంది. మంచు ప్రభావం వల్ల ఇక్కడ టాస్ గెలిచిన జట్టు కళ్ళు మూసుకుని బౌలింగ్ ఎంచుకుంటుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా సులభం. ఎంతటి భారీ లక్ష్యాన్ని అయినా ఇక్కడ ఈజీగా ఛేజ్ చేయవచ్చు.