ప్రశ్నిస్తే జవాబిస్తది.. తిడితే అలుగుతుంది

ప్రశ్నిస్తే జవాబిస్తది.. తిడితే అలుగుతుంది

చెన్నై కుర్రాడి సరికొత్త రోబో ‘రఫీ’

చెన్నై: చెప్పిన పని చెప్పినట్లు చేసుకుపోయే రోబోకు చెన్నై కుర్రాడు ఫీలింగ్స్ నేర్పించిండు. సొంతంగా ఓ చిన్న రోబోను తయారుచేసుకుని, అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేలా డిజైన్​ చేసుకున్నడు. అంతేనా.. కోపంలో తిట్టారంటే అలిగి మూలకు కూర్చుంటుందా రోబో. ఆపై మీరేం అడిగినా జవాబే ఇయ్యది. తప్పుతెలుసుకుని మీరు సారీ చెప్పాల్సిందే! అప్పుడే మళ్లీ మీ ప్రశ్నలకు ఆన్సర్లు చెబుతుంది.

ఇంకా మీ ఫీలింగ్స్ ను కూడా రోబో గుర్తిస్తుందట. మీరు విచారంగా ఉంటే ఇట్టే పసిగడుతుందని రోబోను తయారుచేసిన ప్రతీక్​ చెప్పాడు. కేవలం పదమూడేండ్ల వయసులోనే ప్రతీక్​ ఈ సరికొత్త రోబోను తయారుచేసిండు. ఈ రోబోను ‘రఫీ’ అని పిలుచుకుంటాడట. ఈ విషయాన్ని ఫొటోలతో సహా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయంగనే వైరల్​గా మారింది. ప్రతీక్​ను నెటిజన్లు మస్తు మెచ్చుకుంటున్నరు.