నీటిలో ఊపిరి పీల్చకుండా ఉండి గిన్నిస్ రికార్డు.. ఎన్ని నిమిషాలో తెలుసా..?

నీటిలో ఊపిరి పీల్చకుండా ఉండి గిన్నిస్ రికార్డు.. ఎన్ని నిమిషాలో తెలుసా..?

భార‌త యువ‌కుడు స‌రికొత్త సాధ‌న‌తో గిన్నిస్ రికార్డుకెక్కాడు. నీటిలో మునిగి ఊపిరి పీల్చకుండా ఒకటి, రెండు కాదు… ఏకంగా ఆరు రూబిక్స్ క్యూబ్ లను తిరిగి సక్రమంగా అమర్చాడు చెన్నైకి చెందిన 25 ఏళ్ల యువకుడు. అది కూడా కేవలం 2.17 సెకన్ల వ్యవధిలోనే. ఇది సరికొత్త గిన్నిస్ రికార్డని గుర్తిస్తూ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ఈ వీడియోను షేర్ చేశారు.

చెన్నైకి చెందిన‌ ఇలయారమ్ శేఖర్ అనే యువకుడు ఈ ఘనతను సాధించాడు. ఈ రికార్డును అధికారికంగా గుర్తిస్తున్నామని, ప్రపంచంలో అతి తక్కువ సమయంలో ఆరు క్యూబ్ లను ఊపిరి పీల్చకుండా నీటిలో సాల్వ్ చేయడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. తాను 2013 నుంచి క్యూబ్ లను సాల్వ్ చేస్తున్నానని, రెగ్యులర్ గా యోగాను చేయడం ద్వారా శ్వాసను అదుపులో ఉంచుకునే సమయాన్ని పెంచుకోగలిగానని తెలిపాడు శేఖర్.