నన్ను పక్కకు నెట్టాలని చూస్తున్నరు : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని

నన్ను పక్కకు నెట్టాలని చూస్తున్నరు : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని
  • ఎమ్మెల్యేగా లేకున్నా పర్లేదు 
  • ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన
  • వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు  

వేములవాడ, వెలుగు : ‘నేను ఎమ్మెల్యేగా లేకున్నా పర్లేదు..ఇప్పటికే నాలుగు సార్ల గెలిచిన.. ఇంకా పదవిపై వ్యామోహం లేదు. కానీ, ఒక్కటి చెబుతున్నా..ఇక్కడి ప్రజల ఆస్తులు కబ్జా చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను’ అంటూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు కామెంట్స్​చేశారు. రైతులకు విద్యుత్​పై పీసీసీ చీఫ్ ​రేవంత్​రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్​అధ్వర్యంలో వేములవాడలోని మూలవాగు బ్రిడ్జి దగ్గర ధర్నా చేశారు. 

పార్టీ ఆదేశాలతో కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు అసమ్మతి నేతలు, పార్టీ టికెట్ ఆశిస్తున్న ఏనుగు మనోహర్ రెడ్డి అయన అనుచరులు, చలిమెడ లక్ష్మీనరసింహారావు వర్గీయులు పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కొంత మంది అటు, ఇటు ఉంటున్నారని, తనకు అన్నీ తెలుసన్నారు. తనను పక్కకు నెట్టాలని చాలా మంది చూస్తున్నారని, ఒక వేళ అదే జరిగితే...దొంగలను మాత్రం రానివ్వద్దన్నారు. 

తన ముందు లాగులు వేసుకున్న వాళ్లు కూడా తన గురించి మాట్లాడుతున్నారన్నారు. జడ్పీ చైర్​పర్సన్ ​న్యాలకొండ అరుణ, మున్సిపల్​ చైర్​పర్సన్​ రామతీర్థపు మాధవి, టెక్స్​టైల్స్ ​డెవలప్​మెంట్​ కార్పొరేషన్ చైర్మన్​ గూడూరి ప్రవీణ్, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మాజీ మార్కెఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, సెస్ చైర్మన్​రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి పాల్గొన్నారు.