మైనార్టీల అభివృద్ధికి సర్కార్ కృషి

మైనార్టీల అభివృద్ధికి సర్కార్ కృషి

కోల్​బెల్ట్‌‌‌‌/గోదావరిఖని, వెలుగు: మత సామరస్యం కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం.. దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ కృషి చేస్తోందని చెప్పారు. గురువారం రంజాన్ సందర్భంగా మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, మందమర్రిలోని ఈద్గాల్లో ముస్లింలతో కలిసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామితో ముస్లింలకు ఎంతో అనుబంధం ఉందని, వారితో కలిసిమెలిసి ఉంటూ శర్వాణి ధరించేవారని గుర్తుచేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ పరిధిలో ముస్లింలు ఎల్లప్పుడూ తమ కుటుంబానికి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. 

నియోజకవర్గంలోని చెన్నూరు, రామకృష్ణాపూర్, మందమర్రిలోని కబరిస్తాన్, ఈద్గాల అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎంపీ ఎన్నికల తర్వాత పనులు మొదలవుతాయని తెలిపారు. రామకృష్ణాపూర్ పాత పోలీస్ స్టేషన్, మందమర్రిలోని 132 సింగరేణి పవర్ సబ్‌‌‌‌ స్టేషన్, పాత బస్టాండ్ ఏరియా విద్యానగర్‌‌‌‌‌‌‌‌లోని ఈద్గాల్లో ఆయన ప్రార్థనలు చేశారు. రామకృష్ణాపూర్ విద్యానగర్‌‌‌‌‌‌‌‌లోని సిటీ కేబుల్ నెట్‌‌‌‌వర్క్ యాజమాని సలీం కుటుంబసభ్యులతో కలిసి వివేక్‌‌‌‌ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సీనియర్ జర్నలిస్టు ఎండి.మునీర్, మైనార్టీ లీడర్లు ఎండీ అబ్దుల్ అజీజ్, జావిద్, ఆఫీజ్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, ​ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, రామకృష్ణాపూర్, మందమర్రి పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు పల్లె రాజు, నోముల ఉపేందర్ గౌడ్, పీసీసీ జనరల్ సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గోదావరిఖనిలో ఎమ్మెల్యే రాజ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌తో కలిసి.. 

గోదావరిఖనిలోని శారద నగర్‌‌‌‌‌‌‌‌ ఈద్గాలో రామ గుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌తో కలిసి వివేక్ వెంకటస్వామి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన రామగుండం నియోజకవర్గ ముస్లిం సోదరులకు అండగా ఉంటానని చెప్పారు.