
- మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ఆఫీసర్లతో రివ్యూ
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశిం
చారు. మంగళవారం సాయంత్రం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో మందమర్రి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్లు, డీఈ, ఏఈలతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రివ్యూ నిర్వహించారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి కొత్త పనులకు ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠధామం, డంప్యార్డుకు సుమారు 13.5 ఎకరాల స్థలానికి సింగరేణి యాజమాన్యం పర్మిషన్ ఇవ్వడంతో చేపట్టాల్సిన నిర్మాణ పనులపై చర్చించారు.
రూ.1.80 కోట్లతో శ్రీనివాస గార్డెన్స్ నుంచి ఎంఎన్ఆర్ గార్డెన్స్వరకు లైటింగ్, రెయిలింగ్ కోసం ప్రతిపాదనలు, డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం రూ.40 కోట్లతో చేపట్టిన అమృత్2.0 స్కీమ్ పైపులైన్ పెంపు, వార్డుల్లో రూ.40 కోట్లతో వరద కాల్వల నిర్మాణ పనుల కోసం ప్రతిపాదనలు, డిజైన్, సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుపై చర్చించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్ల టీయూఎఫ్డీసీ ఫండ్స్ తో చేపట్టిన అభివృద్ధి పనులు, కొత్త పనులకు ప్రతిపాదనలపై రివ్యూ చేశారు. సమావేశంలో మున్సిపల్కమిషనర్లు గద్దె రాజు, తుంగపిండి రాజలింగు, డీఈ సుమతి, ఏఈలు అచ్యుత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.