కాకా బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ గుర్తింపు రావడం శుభపరిణామం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాకా బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి  అటానమస్ గుర్తింపు రావడం శుభపరిణామం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి ఆటనామస్ గుర్తింపు రావడం శుభపరిణామం అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.అటనామస్ గుర్తింపు వచ్చినందుకు హైదరాబాద్  బాగ్ లింగంపల్లిలోని కాలేజీ ప్రాంగణంలో టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఎంపీ గడ్డం వంశీ, అంబేద్కర్ ఇన్ స్ట్యూషన్స్ కరెస్పాండెంట్ సరోజా వివేకానంద్, వైష్ణవి పాల్గొన్నారు. ఉత్తమ విద్యాబోధన, అధునాతన సౌకర్యాలతో అంబేద్కర్ కాలేజీలో విద్యాబోధన అందించడం పట్ల  కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని కాకా వెంకటస్వామి  ఇన్ స్ట్యూషన్ పెట్టారు. గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి ఫెసిలిటీస్ కల్పించాం. ఫ్యాకల్టీ మెంబర్స్ ఎఫర్ట్స్ తోనే గొప్ప విజయం సాధించాం. టాప్ ర్యాంక్స్ రావడంలో ఫ్యాకల్టీ పాత్ర మరువలేం. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం మేనేజ్మెంట్ బాధ్యత.  న్యాక్, అటనామస్ గుర్తింపు రావడం శుభపరిణామం. కాకా వెంకటస్వామి ఈ విద్యాసంస్థలకు యూనివర్సిటీ గర్తింపు రావాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థి గొప్పగా ఫీల్ అవ్వాలి. ఫ్యాకల్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అంచడంపై దృష్టి పెట్టాలి అందరు కలిసి పని చేయాలి అని అన్నారు.