చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌.. తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ హ్యాట్రిక్‌

చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌.. తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ హ్యాట్రిక్‌

పనాజి: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ ఎరిగైసి.. చెస్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో హ్యాట్రిక్‌‌ విజయాలను నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌‌ తొలి గేమ్‌‌లో అర్జున్‌‌ 30 ఎత్తుల వద్ద షంసిద్ధీన్‌‌ వోఖిడోవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌)పై గెలిచాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్‌‌ క్వీన్‌‌ పాన్‌‌ ఓపెనింగ్‌‌తో ముందుకెళ్లాడు. ఆరంభంలోనే అద్భుతమైన ఎత్తులతో  గేమ్‌‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ స్ట్రాటజీ నుంచి తప్పించుకునేందుకు ఉజ్బెక్‌‌ ప్లేయర్‌‌ వేసిన ఎత్తుగడలు ఎక్కడా ఫలించలేదు. గ్రాండ్‌‌ మాస్టర్‌‌ డానియెల్‌‌ దార్దా (బెల్జియం)తో జరిగిన గేమ్‌‌లో పెంటేల హరికృష్ణ 25 ఎత్తుల వద్ద ఈజీగా నెగ్గాడు.

తెల్లపావులతో ఆడిన తెలుగు గ్రాండ్‌‌ మాస్టర్‌‌ గేమ్‌‌ మధ్యలో వైవిధ్యమైన వ్యూహాలను అమలు చేసి సక్సెస్‌‌ అయ్యాడు. ఇక డి. గుకేశ్‌‌..  ఫ్రెడెరిస్‌‌ సాన్వే (జర్మనీ) మధ్య జరిగిన గేమ్‌‌ 34 ఎత్తుల వద్ద, ఆర్‌‌. ప్రజ్ఞానంద.. రాబర్ట్‌‌ హోవనిస్యాన్‌‌ (ఆర్మేనియా) మధ్య జరిగిన గేమ్‌‌ 30 ఎత్తుల వద్ద, విదిత్‌‌ గుజరాతీ.. సామ్‌‌ షాంక్లాండ్‌‌ (అమెరికా) 32 ఎత్తుల వద్ద, దీప్తియాన్‌‌ ఘోష్‌‌.. గాబ్రియెల్‌‌ సెర్గిస్సాన్‌‌ (ఆర్మేనియా) 59 ఎత్తుల వద్ద డ్రాగా ముగిశాయి.