చేవెళ్ల బస్సు ఘటన.. టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించిన ప్రభుత్వం

చేవెళ్ల బస్సు ఘటన..  టిప్పర్ డ్రైవర్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించిన ప్రభుత్వం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతిచెందిన టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కామ్లే కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ఆయన కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్ మండలం బిజెవాడి గ్రామానికి చెందిన ఆకాశ్ కుటుంబానికి సోమవారం ఎమ్మెల్యే యాదయ్య, ఆర్డీవో చంద్రకళ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.