
చేవెళ్ల, వెలుగు : సీఎం కేసీఆర్ చెప్పే మాయమాటలను నమ్మొద్దని చేవెళ్ల సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. శనివారం శంకర్ పల్లి మండలం మీర్జాగూడ, జన్వాడ, దొంతన్ పల్లి, మహారాజ్ పేట, గోపులారం, పొన్నగుట్ట తండా, ఇరుకుంట తండా, కాకర్లగుట్ట తండా, కొండకల్, కొండకల్ తండా, శేరిగూడ గ్రామాల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు.
తెలంగాణలో సాధికారిత బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటీలకు చేరాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.