ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతికి ఘన నివాళి

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఛత్రపతికి ఘన నివాళి

ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతిని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోని శివాజీ విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడారు. శివాజీ ఆశయాల సాధన కోసం పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా మొఘలులకు ఎదురు నిలిచిన ధీరుడని కొనియాడారు. జుక్కల్​లో శివాజీ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భూమిపూజ చేశారు.- వెలుగు, నెట్​వర్క్: