
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ, చత్తీస్‌గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని సర్వే సంస్థలన్నీ ప్రకటించాయి. కానీ.. చత్తీస్‌గఢ్ విషయంలో మాత్రం అన్ని సర్వే ఏజెన్సీల అంచనాలు తప్పాయి. ఇక్కడ అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో 68 స్థానాల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌కు.. ఈసారి 40 స్థానాల్లోపే వచ్చాయి. పోయిన సారి బీజేపీ 15 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఈసారి ఏకంగా హాఫ్ సెంచరీ దాటింది.
తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో ఏబీపీ సీ ఓటర్ సర్వే ప్రకారం.. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 41 నుంచి 53 సీట్లు, బీజేపీకి 36 నుంచి 48 స్థానాలు, ఇతరులకు 0 నుంచి 4 సీట్లు వస్తాయని చెప్పింది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పోల్ కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పింది. 40 నుంచి 50 స్థానాల్లో కాంగ్రెస్, 36 నుంచి 46 స్థానాల్లో బీజేపీ, ఇతరులకు 15 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఇక రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీ ఓడిపోతుందని చెప్పింది. కాంగ్రెస్‌కు 44 నుంచి 52 సీట్లు, బీజేపీకి 34 నుంచి 42 స్థానాలు, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. ఇండియా టీవీ సీఎన్ఎక్స్ కూడా కాంగ్రెస్‌దే అధికారమని తేల్చింది. 46 నుంచి 56 సీట్లలో కాంగ్రెస్, 30 నుంచి 40 స్థానాల్లో బీజేపీ, ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది.