భార్యకు అలా ఇష్టంలేకపోయినా.. బలవంతం చేసిన భర్తకు 9 ఏళ్ల జైలు

భార్యకు అలా ఇష్టంలేకపోయినా.. బలవంతం చేసిన భర్తకు 9 ఏళ్ల జైలు

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓ భర్తకు తొమ్మిదేళ్ల కారాగార శిక్ష విధించింది. భిలాయ్-దుర్గ్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తన భార్యను అసహజ సెక్స్‌కు బలవంతం చేసినందుకు కోర్టు ఈ నిర్ణయం వెల్లడించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం, 2007లో వివాహం అయినప్పట్నుంచి తన భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. బలవంతపు అసహజ సెక్స్ కోరిక అతన్ని చివరికి మృగాన్ని చేసింది. అంతే కాదు అతను తన భార్యను వరకట్నం కోసం కూడా వేధించేవాడు. వీటన్నింటితో కలత చెందిన ఆమె తన అత్తమామల ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది.  

2016లో కుమార్తెతో పాటు తల్లితండ్రుల వద్దకు వెళ్లిన ఆమె తన భర్తపై వరకట్న వేధింపుల చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య కంప్లైంట్ నిమిత్తం అతనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 377 కింద మే, 2016లో సుపేలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తాజాగా నేరం స్వభావాన్ని పరిగణలోకి తీసుకున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. భర్తది శిక్షార్హమైన నేరమని అభివర్ణించింది. అతనికి ఐపీసీ సెక్షన్ 323కింద 9 సంవత్సరాల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. ఇదే ఆరోపణలతో అతని తల్లిదండ్రులకు కూడా ఒక్కొక్కరికి 10నెలల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.