Good Health: ఏ గ్రూపు బ్లడ్ వారు చికెన్, మటన్ తినాలో తెలుసా...

Good Health:  ఏ గ్రూపు బ్లడ్ వారు చికెన్, మటన్ తినాలో తెలుసా...

చికెన్(Chicken) అంటే చాలా మంది లొట్టలేసుకుని మరీ తింటుంటారు.  కొంతమంది వారం.. వర్జం లేకుండా నిత్యం లాగిచ్చేస్తుంటారు.  కానీ తరచుగా చికెన్ తినడం కూడా ప్రమాదకరమే.  ప్రతిఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ ను బట్టి వారి ఆహారాన్ని ఎంచుకోవాలి.మరి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలం మారింది మనుషులు మారుతున్నారు. రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్టు, మానవాళి కూడా పూర్తిగా ప్రాచ్యాత్య ఫుడ్డు అలవాటు పడి మన ఇండియన్ ఫుడ్ విస్మరించి, అనేక రోగాల బారిన పడుతున్నారు. దీంతో మనం తినే ఫుడ్ విషయంలో కూడా అనేక రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి.  దీంతో వెజ్ ఫుడ్ తిన్నా కానీ మనిషికి జీర్ణం చేసుకునే శక్తి లేకుండా పోతుంది.బ్లడ్ గ్రూప్ ఆధారంగా తీసుకున్న ఆహారం శరీరం వేగంగా జీర్ణం అవుతుందట.   మనుషుల యొక్క బ్లడ్ గ్రూప్ ను బట్టి కూడా మనం తినే ఆహారం నిర్ణయించుకోవాలని పరిశోధకులు అంటున్నారు.

పూర్వం మన తాతల కాలంలో వారు ఎలాంటి ఫుడ్ తిన్న అరిగించుకునేవారని, చివరికి రాళ్లు తిన్న అరిగే శక్తి వారికి ఉండేదని , అలాంటి శక్తివంతమైనటువంటి ఇండియన్స్ , చైనీస్ ఫుడ్ కు అలవాటు పడి పూర్తిగా నాశనమవుతున్నారు.  ప్రస్తుత కాలంలో మామూలు వెజ్ ఫుడ్ తింటేనే జీర్ణం చేసుకునే పరిస్థితి లేదు. అలాంటిది చికెన్, మటన్ దేవుడెరుగు.. ఈ క్రమంలోనే కొన్ని బ్లడ్ గ్రూపుల వారు చికెన్, మటన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు శాస్త్రవేత్తలు.

మానవునికి  మొత్తం నాలుగు బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఇందులో  ఓ, ఏ, బి, అలాగే ఏబి. (O,A,B and AB) ఈ నాలుగు రకాల బ్లడ్ గ్రూపుల వారి జీర్ణశక్తి ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుందట. ఇందులో ఏ బ్లడ్ గ్రూపు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.. 

చికెన్, మటన్ అందరూ జీర్ణించుకోలేరు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..కొన్ని బ్లడ్ గ్రూపులో విషయంలో చికెన్ తరుచుగా తీసుకవోడం చాలా వరకు తగ్గించాలి. లేదంటే రకరకాల శారీరక సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. 


A బ్లడ్ గ్రూప్: ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు చాలా సున్నితంగా ఉంటారు.  వీరికి రోగ నిరోధక శక్తి కూడా సున్నితంగానే ఉంటుంది.  జీర్ణశక్తి కూడా తక్కువగా ఉంటుంది. కావున వీరు తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి . ఇలాంటివారు శాఖాహారం తినడమే ఎక్కువ మేలు.  చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది.  మాంసాహారం జీర్ణం చేసుకోవడం వీరికి కష్టమే. చాపలు, వివిధ రకాల పప్పులను తింటే వీరికి త్వరగా జీర్ణం అవుతాయి. 

B బ్లడ్ గ్రూప్: ఈ గ్రూపు వారు కాస్త శక్తివంతులు. వీరికి  రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. వీరు చికెన్, మటన్ ఎలాంటి ఫుడ్ అయినా త్వరగా జీర్ణం చేసుకుంటారట. కాబట్టి వీరు ఆహారంలో వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా తినడం మంచిదే అని పరిశోధకులు అంటున్నారు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం చాలా ముఖ్యం.

AB, O బ్లడ్ గ్రూప్స్: ఈ బ్లడ్ గ్రూప్స్ కలిగిన వారు ఏ ఆహారమైన సమతుల్యంగా తినడం మంచిది.  ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు.అయితే కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో ఇబ్బంది మెుదలవుతుంది. జీర్ణమయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి.