పార్లమెంట్ లో ఎన్నికల ప్రచారం చేసినట్టుగా ఉంది

పార్లమెంట్ లో ఎన్నికల ప్రచారం చేసినట్టుగా ఉంది

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదని.. ఓట్ల కోసం తీసుకొచ్చిన బడ్జెట్ అని విమర్శించారు కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం. ఇది ఎన్నికల ప్రసంగంతో కూడిన పూర్తి స్థాయి బడ్జెట్ లాగా ఉందన్నారు. రైతులకు మనీ ట్రాన్ఫర్ స్కీంపైనా మండిపడ్డారు చిదంబరం. మార్చి 31కి ముందు రూ.2వేలు ఇవ్వడమంటే ఓట్లు కొనడమే అవుతుందన్నారు. పీయూష్‌ బడ్జెట్‌ ప్రసంగం ఎన్నికల ప్రచారాన్ని తలపించిందని ..బడ్జెట్‌ లో సంతోషించదగ్గ అంశాలు లేవన్నారు. రైతులకు రోజుకు 17 రూపాయలు ఇస్తే సంతోషించాలా? అని ప్రశ్నించారు. విద్య, ఉపాధి గురించి ప్రస్తావించలేదని.. పది పాయింట్ల పత్రంలో ఈ రెండు అంశాలు లేవని చిదంబరం తెలిపారు.