ఎన్నికలకు రెడీగా ఉన్నాం : ఎన్నికల కమిషన్

ఎన్నికలకు రెడీగా ఉన్నాం : ఎన్నికల కమిషన్

దేశంలో రాబోయే లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామని ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఫిబ్రవరి 17వ తేదీ ఒడిశా రాష్ట్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పరిశీలన పూర్తయ్యిందని.. ఎన్నికల కోసం అధికారులను సమాయత్తం చేశామన్నారు. ఈవీఎంలు అన్నింటినీ చెక్ చేసి.. పోలింగ్ కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారాయన. పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. ఈ రెండు ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని వెల్లడించారాయన.

శాంతి భద్రత విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహించిన.. సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు ప్రభావాన్ని తగ్గించటానికి నిరంతరం తనిఖీలు చేస్తున్నామని.. ప్రత్యేక సిబ్బందితో చెకింగ్స్ పెంచామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొరికిన డబ్బే ఇందుకు నిద్శనం అన్నారు. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించటానికి సర్వం సిద్ధం చేశామని.. షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందన్నారు. ఏయే తేదీల్లో షెడ్యూల్ అనే విషయాన్ని ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.