ప్రశాంతంగా ఎన్నికలు.. 9 గంటల వరకు 9.5 శాతం ఓటింగ్

ప్రశాంతంగా ఎన్నికలు.. 9 గంటల వరకు 9.5 శాతం ఓటింగ్

పోలింగ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన  మాక్ పోలింగ్ లో వచ్చిన సమస్యలను గుర్తించి వాటిని ఆ ఈవీఎంలను రిప్లేస్ చేశామని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. ఉదయం 9గంటల వరకు 9.5 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు. బీజేపీ నేత కిషన్ రెడ్డిపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు, వాటిపై విచారణ చేస్తామని ఆయన అన్నారు.

హైదరాబాద్  ఎస్సార్ నగర్ లోని ఆదర్శ పోలింగ్  బూత్ లో ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్  వికాస్ రాజ్ కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీ ఎన్నికలకు భారీ ఏర్పాట్లు చేశామని  చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఎక్కడైనా సమస్యల ఉంటే సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చని కోరారు. 

పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా చేవెళ్లలో 8.29శాతం, మల్కాజ్ గిరి 8.5శాతం, ఖమ్మంలో 12.24, కరీంనగర్ 10.23శాతం,హైదరాబాద్ లో 5.6శాతం, మెదక్ లో 11శాతం,నాగర్ కర్నూల్ లో 10.3,నల్గొండలో 10.6శాతం ఓటింగ్ నమోదైంది.