గండి పడడం మామూలే.. ప్రోత్సహించాలి: సర్కారు ఇంజినీర్

గండి పడడం మామూలే.. ప్రోత్సహించాలి: సర్కారు ఇంజినీర్

సిద్దిపేట జిల్లా : కొత్త కాలువలకు గండి పడటం అనేది సర్వ సాధారణమ‌న్నారు ENC (ఇంజినీర్ ఇన్ చీఫ్)హరీరాం. కొండపోచమ్మ సాగర్ కాలువ గండి పడటం ప్రెస్ మీట్ నిర్వ‌హించిన ఆయ‌న‌… కాలువల్లో నీటిని విడుదల చేసినప్పుడు ఇలాంటివి జరగడం సహజమ‌ని , తాము అనుకున్న దానికంటే తక్కువనే జరిగిందని చెప్పారు.

కొత్త ప్రాజెక్ట్ లు నిర్మించినప్పుడు అధికారుల కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సాహించాలి కాని.. చిన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంజ‌నీర్లను నిరాశకు గురి చేయొద్ద‌న్నారు. నాణ్యతతో కూడిన ప్రాజెక్ట్, కాలువలను నిర్మించామ‌ని, గండి ప‌డిన విష‌యంపై మీడియా వక్రీకరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.