ఓటు వేసిన సీఎం నితీశ్, తేజస్వీ యాదవ్

ఓటు వేసిన సీఎం నితీశ్, తేజస్వీ యాదవ్

బీహర్ లో సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇవాళ 94 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం నితీశ్ కుమార్ దిఘాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ పాట్నాలోని రాజేంద్రనగర్  సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో ఓటు వేశారు.

ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్, తన తల్లి, మాజీ సీఎం రబ్రీ దేవితో కలిసి పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రజలు ఓటుతో మార్పు తెస్తారన్న నమ్మకం ఉందన్నారు. బీహార్ అభివృద్ధి అవసరమని రబ్రీ దేవి అన్నారు తేజస్వీ యాదవ్ తమ్ముడు తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్ పుర్ లో ఓటు వేశారు.