ఢిల్లీలో ఘనంగా 74 ఆర్మీ డే సెలబ్రేషన్స్

ఢిల్లీలో ఘనంగా  74 ఆర్మీ డే  సెలబ్రేషన్స్

74 ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర నివాళులు అర్పించారు త్రివిధ దళాల అధికారులు. సాయుధ దళాల చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ హరికుమార్ అమరులైన సైనికులను శ్రద్ధాంజలి అర్పించారు. అమర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సైనికులు ఆర్మీ డే శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ధైర్యవంతులైన సైనికులే భారత్ కు బలమన్నారు. భారత సైన్యం ధైర్యసాహసాలు, నైపుణ్యత ఎంతో గొప్పదన్నారు. జాతీయ భద్రత కోసం భారత సైన్యం రాత్రింబవళ్లు శ్రమిస్తోందన్నారు ప్రధాని. సైనికుల సేవలు, ఆర్మీ గొప్ప తనాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవడం లేదన్నారు ప్రధాని. మరోవైపు ఆర్మీ డే సందర్భంగా సైనికుల సాహసాలకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది భారత ఆర్మీ. 

ఇవి కూడా చదవండి: 

17న దావోస్ సమ్మిట్​లో మోడీ స్పీచ్

ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు