స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యుద్ధాలు

స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యుద్ధాలు

న్యూఢిల్లీ: స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యుద్ధాలు జరగొ చ్చని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న డిఫెన్స్ స్పేస్ సింపోజియంను ఆయన ప్రారంభిం చారు. ‘‘స్థిరంగా కొనసాగుతున్న స్పేస్ వెపనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అంతరిక్షంలో యుద్ధానికి దారితీయొచ్చు. అంతరిక్షం అనేది భూమి, సముద్రం, గాలితోపాటు సైబర్ తదితర రంగాల సామర్థ్యాలను పెంపొందించే ఒక డొమైన్. రష్యా, చైనాలు యాంటీ శాటిలైట్ టెస్టులు నిర్వహించాయి. అంతరిక్ష రంగంలో ఇండియా కూడా అఫెన్సివ్, డిఫెన్సివ్ సామర్థ్యాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి డ్యుయల్ యూజ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని సూచించారు.