యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వర్తిస్తున్న కాండూరి వెంకటాచార్యులుకు ఆలయ స్థానాచార్యులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి దేవస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధనుర్మాసం పూర్తయ్యే వరకు ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులుకు స్థానాచార్యులుగా పూర్తిగా అదనపు బాధ్యతలు కేటాయిస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
