సీసీఎస్ పీఎస్‌‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు

సీసీఎస్ పీఎస్‌‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు

క్యాసినో హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ సీసీఎస్ పీఎస్ కు చేరుకున్నారు. తన పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆయన కోరారు. తన పేరును కించిపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ఇలాంటి చర్యలతో తాను చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించారు. పబ్లిక్, మీడియా ఎదుట తాను బద్నాం అవుతున్నానని తెలిపారు. వీలైనంత త్వరగా వ్యక్తులను పట్టుకోవాలని కోరారు. క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్, సంపత్, మాధవరెడ్డిలను మంగళవారం రెండో రోజు విచారించారు . ఈడీ విచారణ సందర్భంగా తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చికోటి మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన పేరుతో అగంతకులు నకిలీ ఖాతాలు తెరిచారని ఆరోపించారు. నకిలి ఖాతా పేరుతో పోస్టులు చేస్తున్న అగంతకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా క్యాసినో వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే చికోటి నుంచి ల్యాప్ ట్యాప్, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.