సమ్మర్ హాలిడేస్‌‌ మూవీలో మెగాస్టార్ కూతురు...

సమ్మర్ హాలిడేస్‌‌ మూవీలో మెగాస్టార్ కూతురు...

‘మన శంకర వరప్రసాద్ గారు’  చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పాత్రలో తనదైన  నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలనటి  ఖుషి ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ధీరజ్ మొగిలినేని ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌పై రూపొందుతున్న చిల్డ్రన్ మూవీ  ‘సమ్మర్ హాలిడేస్’లో ఖుషి కీలక పాత్రలో నటిస్తోంది. మంగళవారం  ఖుషి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. 

ఇందులో   ఖుషి అమాయకమైన చిరునవ్వుతో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. చిన్నారుల ప్రపంచం, వారి ఎమోషన్స్,  సరదా సంఘటనలను అందంగా ఆవిష్కరించే ఈ సినిమాలో ఖుషి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.  చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన  కథతో దర్శకుడు శ్రీకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘90స్ మిడిల్ క్లాస్’ ఫేమ్   మాస్టర్ రోహన్,  ‘35 చిన్న కథ కాదు’ ఫేమ్ మాస్టర్ అరుణ్  ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు.